తెలంగాణ రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు కొండంతా అండ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేదోళ్లకు అభయహస్తం కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2, 3, 23, డివిజన్లలో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కడుపులో ఉన్న పసిపాప నుండి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర సీఎం కెసిఆర్ పాలనలోని తెలంగాణ అని అన్నారు. సమైక్య పాలనలో లంబాడి తండలో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవని.. ఇప్పుడు కెసిఆర్ పాలనలో అడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబురాలు చేసుకునే రోజులు వచ్చాయి అని అన్నారు. పేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక లక్ష 116 రూపాయలను అందిస్తున్నారని అన్నారు. వృద్ద వికలాంగులు గౌరవంగా జీవించేలా ఆసరా పింఛన్ ద్వారా నెలకు రెండు వేల రూపాయలను అందిస్తున్న మనసున్న సి.ఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. సకల వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి రుణం తీర్చుకోవాలని సిఎం కెసిఆర్ గారి పైన ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే ముక్త కంఠంతో ఖండించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..