ఇల్లందకుంట: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని మండల ఏఓ గుర్రం రజిత పేర్కొన్నారు. మండలంలోని బుజునూర్ గ్రామ రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు సీతంపేట గ్రామంలో అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాండం కుల్లు, తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందని, వాటి నివారణకు వైల్డామైసిన్, ప్రోపికోనోజోల్, హెక్సాకొనజోల్ 2ఎంఎల్/లీటరు నీటితో వారానికి రెండు సార్లు స్ప్రే చేయాలన్నారు. అలాగే సుడిదోమ నివారణకు డైఫెంతిరోన్ పెరిమీటర్‌జోన్ 2ఎంఎల్/లీటరు నీటికి వారం రోజులకు రెండుసార్లు స్ప్రే చేయాలన్నారు. కేవీకే ఉద్యానవన అధికారి వేణుగోపాల్ మిరపంటలో, అరటి తోటలో వచ్చే తెగులు, చీడపీడలపై వివరించారు. పంట కోత నీటి లభ్యత ఉన్న వరిపొలాలలో కోత తదుపరి పెసర పంటలు సాగు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ రాకేశ్, సర్పంచ్ మూడెత్తుల వెంకటస్వామి, ఎంపీటీసీ తెడ్ల ఓదెలు, వార్డుసభ్యులు, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ బోయిని నారాయణ, గ్రామ కో-ఆర్డినేటర్ ఎండీ రహీమ్, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement