Saturday, November 23, 2024

విధ్వంసం సృష్టించేందుకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు బండిపై గంగుల ఫైర్‌..

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: బండి సంజయ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ధజమెత్తారు. కరీంనగర్‌లో 9.90 లక్షలతో చేపట్టనున్న కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి గంగుల గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు విధంసాన్ని కోరుకోరని, అభివృద్ధిని కాంక్షిస్తారన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో ఉందని, బండి సంజయ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని ధజమెత్తారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని ఇందుకు గుజరాత్‌ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అందుకే ఇక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని, బండి సంజయ్‌ గడ్డపారతో తవ్వడం కాదు నిధులు తెచ్చి అభివృద్ధి యాలన్నారు.మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని, తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే బండి సంజయ్‌ మత ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారని, పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదన్నారు.


కరీంనగర్‌లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తెలంగాణ రాకముందు కూడా ఇక్కడి ప్రజలు పన్నులు కట్టారు కాని నాడు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఉద్యమకారుడు పాలకుడై కరీంనగర్‌లో అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారని కరీంనగర్‌ అభివృద్ధి కోసం వేల కోట్లు- విడుదల చేస్తున్నారని, కరీంనగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్‌ బ్రిడ్జి… మానేర్‌ రివర్‌ ఫ్రంట్‌ నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరని, అభివృద్ధిని కాంక్షిస్తారని, మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదన్నారు. రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదన్నారు. బండి సంజయ్‌ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల మూలంగా శాంతియుతంగా ఉన్న తెలంగాణలో అశాంతి నెలకొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండడంవల్లే అనేక కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడ పెట్టు-బడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. గుడులు, మసీదులు ధ్వంసం చేసేందుకు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం తవ్వకాలు చేపట్టాలని బండికి మంత్రి గంగుల హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement