- పరామర్శకు వస్తే.. పరుగెత్తించిన గ్రామస్తులు
- రాళ్లతో దాడి.. అరవింద్ కారు అద్దాలు ధ్వంసం
- గంట పాటు కొనసాగిన ఉద్రిక్తత
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వారిని పరామర్శించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం ఎదురయింది. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని గ్రామస్తులు చెప్పుల దండలు చేత పట్టుకొని అడ్డుకున్నారు. గత ఏడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు కలిసి ఎంపీని కలిసి విన్నవించారు. అయిన పట్టించుకోలేదని ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చావని గ్రామస్తులు నిలదిశారు.
ఓట్ల కోసం చేతులు జోడించి మొక్కే బూటకపు రాజకీయ నాయకులు ఈ గ్రామంలోకీ రావద్దనీ ఎంపీకీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తు గంట పాటు బైఠాయించారు. ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు గ్రామస్తులను శాంతింప చేసిన పలితం లేక బైఠాయించిన పలువురిని లాగేశారు. ముంపునకు గురైన గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుని మాకు న్యాయం చేయాలని, వివాదంలో ఉన్న మల్లన్నగుట్ట భూమి గ్రామనికి చెందే వరకు నిరసనలు అపమని గ్రామస్తులు స్పష్టం చేశారు.