పెద్దపల్లి: ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కెనాల్ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ చివరి భూముల రైతాంగానికి సాగు నీరందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాకతీయ కెనాల్ నుంచి డీ-83, 86 డిస్టిబ్యూటరీల ద్వారా నియోజకవర్గంలోని 2లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వరిపంటకు తప్పనిసరిగా నీరు అవసరం ఉన్న సమయంలో నియోజకవర్గంలోని చివరి భూముల రైతాంగానికి సాగు నీరందడం లేదన్నారు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, గౌరవ ముఖ్యమంత్రితోపాటు సంబంధిత శాఖ మంత్రి చొరవ తీసుకొని చివరి భూముల రైతాంగానికి సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధిత మంత్రి సమాధానమిస్తూ ఎమ్మెల్యే దాసరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని, చివరి భూముల రైతులకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement