పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం మీ కోసం వార్డు సందర్శనలో భాగంగా పట్టణంలోని 30, 31 వార్డు ప్రజలతో వారికి కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ, అప్పటికప్పుడే అధికారులకు తెలియజేసి పరిష్కారం చేసేలా సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ …చిన్న గల్లీలలో డ్రైనేజీ సమస్యలు తెలుసుకుంటూ, అంతేకాకుండా పాత రోడ్ లను కూడా పూర్తిగా చెడిపోతే కొత్త రోడ్ల నిర్మాణం, పాక్షికంగా చెడిపోతే మరమ్మతుల కోసం వెంటనే అంచనా వేసి పూర్తిస్థాయి రిపోర్టును తయారు చేయాలని అధికారులకు ఆదేశిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రతి సమస్యను పరిష్కరించే దిశలో పనులు జరుగుతాయన్నారు.
డ్రైనేజి, సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా కనెక్షన్ సరిగా ఇవ్వాలని, జరుగ బోయే అభివృద్ధి పనులకు ఆటంకం కలుగ కుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కల్వర్టులను తిరిగి విశాలంగా నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్, కౌన్సిలర్ లు పైడ పద్మ-రవి, హాబీబా బేగం-ఖదీర్ ఖాన్, పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బెక్కం ప్రశాంత్, అక్క పాక తిరుపతి, జాకీర్, దేవరాజ్, జావేద్, మెహరాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, యువకులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..