పెద్దపల్లిరూరల్, (ప్రభ న్యూస్): జలపాతం వద్ద పూర్తి రక్షణ చర్యలతో ప్రమాదాలు నివారించవచ్చని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. పెద్దపల్లి మండలం సబ్బితం గౌరీ గుండాల జలపాతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఇటీవలి కాలంలో జలపాతంలో పలువురు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలపై ఆరా తీశారు. సందర్శకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
జలపాతం వద్ద సర్పంచ్ చుంచు సదయ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచెను పరిశీలించారు. సర్పంచ్ సదయ్యను ఏసీపీ అభినందించారు. పర్యాటకులను అప్రమత్తం చేసేలా సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏసీపీ వెంట సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనా రెడ్డి, సత్యనారాయణ,బసంత్ నగర్ ఎస్సై మహేందర్, సర్పంచ్ చుంచు సదయ్య పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.
- Advertisement -