శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి విక్రయించినా నిల్వచేసినా, సరఫరా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. సమస్యలతో వచ్చే ప్రజలకు పరిష్కారం చూపాలన్నారు. ఎసిపి గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కు సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సైలు రాజేష్, ఉపేందర్, మహేందర్, శ్రీనివాస్, వెంకటకృష్ణ, రాజ వర్ధన్, మౌనిక, వినితా, రవీందర్ లతోపాటు సిబ్బంది పుష్పగుచ్చాలు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement