Monday, November 25, 2024

TS : చిత్రకారుడు అన్నవరంకు ప్రతిభా పురస్కారం

కరీంనగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చిత్రలేఖనం విభాగంలో ప్రతిభా పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు విశ్వ విద్యాలయ రిజిస్టర్ ఆచార్య బట్టు రమేష్ ఒక లేఖ రాశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడైన అన్నవరం శ్రీనివాస్ రెండు దశాబ్దాలుగా చిత్రకళా రంగంలో ఖ్యాతి పొందారు.

- Advertisement -

2007 లో కెఫె డే ఆర్ట్ షోలో ,2010 ఢిల్లీలో, విజువల్ ఆర్ట్ గ్యాలరీలో, 2014లో సాలార్జంగ్ మ్యూజియంలో, ఫలక్ నుమా ప్యాలెస్ లో, హైదరాబాదులోని తారామతి బారాదరిలో పలు చిత్ర ప్రదర్శనలు శ్రీనివాస్ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఆర్ట్ ఎట్ తెలంగాణ సంస్థ వివిధ సందర్భాల్లో నిర్వహించిన వర్క్ షాపుల్లో ప్రదర్శించబడ్డాయి. ఇవే కాకుండా ఆన్లైన్ గ్యాలరీ ప్రదర్శనలు కూడా శ్రీనివాస్ చిత్రాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్బంలో వందలాదిగా కార్టూన్లు పలు పత్రికల్లో అచ్చు అయ్యాయి. కవులు రచయితలకు చెందిన దాదాపు 500 పై చిలుకు పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు గీయడం జరిగింది.

అన్నవరం శ్రీనివాస్ కు ఇప్పటివరకు పి టి రెడ్డి ఆర్ట్ అవార్డు, రైటర్స్ కార్నర్ ఇంటర్నేషనల్ అవార్డు, బిఎస్ రాములు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వరించాయి. ఈనెల 28న ఈ పురస్కారాన్ని హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్ లోని తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రదానం చేస్తారు. అన్నవరం శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందినవారు. కరీంనగర్ మండలంలోని వేగురుపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తూ కరీంనగర్ లో స్థిరపడ్డారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ వీరికి స్వయానా సోదరుడు. శ్రీనివాస్ కు పురస్కారం పోదనం పట్ల కరీంనగర్ చెందిన కవులు రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement