యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా వకీల్‌పల్లి గని ఆవరణలో టీ బీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో 96 మందికి బదిలీ వర్కర్ నుండి జనరల్ మజ్దూర్ ప్రమోషన్ పత్రాలను టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గని వెల్ఫేర్ ఆఫీసర్ ఓంకారి బాబులు కార్మికులకు అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా 190/240 మాస్టర్స్ పూర్తి కాకముందే అడ్వాన్స్ సర్క్యులర్ రిలీజ్ చేసి, వారు 190/240 మాస్టర్స్ నిండిన తర్వాత ప్రమోషన్ పత్రాలను గతంలో ఏ యూనియన్ హయాంలో జరగలేదన్నారు. కేవలం టీబీజీకేఎస్ యూనియన్తోనే సాధ్యమైందన్నారు. ప్రమోషన్ తీసుకున్న వారు రాబోయే రెండేళ్లలో కోల్‌కటింగ్, సపోర్ట్ మెన్, ట్రామర్లాంటి ప్రమోషన్ తీసుకొని అండర్ గ్రౌండ్ మైన్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైన్స్ కమిటీ- మెంబర్స్ బాబు రావు, మల్లయ్య, శ్రీకాంత్, రాజేశం, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement