Friday, November 22, 2024

ప్రైవేటు టీచర్లకు బియ్యం పంపిణీ..

పెద్దపల్లిరూరల్‌: కరోనా కష్టకాలంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం గొప్ప నిర్ణయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రేషన్‌ దుకాణాల వద్ద ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం ప్రకటించిన 25 కిలోల బియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రైవేటు టీచర్ల ఇబ్బందులను గుర్తించి రూ. 2వేల ఆర్థికసాయంతోపాటు 25 కిలోల బియ్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. పాఠశాలలు మూసి వేయడంతో ప్రైవేటు టీచర్లు ధీనావస్థలో ఉన్నారని, వారి ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రైవేటు టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో డీఈఓ జగన్మోహన్‌రెడ్డి, ఎంఈఓ సురేంద్రకుమార్‌, కౌన్సిలర్‌ పోతని పురుషోత్తం, టీచర్లు సంపత్‌రెడ్డి, సత్యనారాయణ, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement