Friday, November 22, 2024

కాంగ్రెస్‌ కార్యకర్తను జైలుకు పంపడం సరికాదు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని గుండారం గ్రామంలో గురవయ్య తోటలో గల 159 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో తహసిల్దార్‌ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గుండారం గ్రామంలో 147 సర్వే నెంబర్‌ లో 159 ఎకరాల భూమి రెవెన్యూ భూమి ఉందని, దానిని ఫారెస్టు అధికారులు ఆక్రమించుకోవడం అన్యాయమన్నారు. 2018 వరకు ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం వస్తుందని గ్రామంలో దళితులు, గిరిజనులకు అట్టి భూమిని పంపిణీ చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం మూడెకరాల భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఫారెస్ట్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్‌ సర్వే జరిపి అట్టి భూమిని రెవెన్యూ భూమి అని తేల్చి పంపిణీ చేయాలన్నారు. భూమిని దళితులకు గిరిజనులకు పంపిణీ చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త రాజు నాయక్‌ పోరాటం చేస్తే రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం శోచనీయమన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్‌, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్లా పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌, జిల్లా ఎస్సి సెల్‌ అధ్యక్షులు బాలరాజు, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సాహెబ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్‌, ఎస్సి సెల్‌ అధ్యక్షులు కరికె శ్రీనివాస్‌, మండల ఉపాధ్యక్షుడు దండు శ్రీనివాస్‌, రైతు సంఘం అధ్యక్షులు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి, యూత్‌ అధ్యక్షులు మనుక నాగరాజు, నాయకులు కటికే రవి, సత్యనారాయణ, గుర్రం రాములు, రాజు, రాజేందర్‌, కిషన్‌, కృష్ణ, బాలుయాదవ్‌, నాగరాజ్‌, సిరిపురం మహేందర్‌, రాజు, పందిళ్ళ శ్రీనివాస్‌, గంట బుచ్చగౌడ్‌, జంకే లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement