Saturday, November 23, 2024

రాజకీయ ప్రకటనలపై పకడ్బందీగా పర్యవేక్షించాలి… కలెక్టర్ డా.బి.గోపి

రాజకీయ ప్రకటనలపై పకడ్బందీగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి. గోపి అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాద్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రచారం కోసం అవసరమయ్యే అనుమతుల జారీ కోసం ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటి (యం.సి.యం.సి) కేంద్రాన్ని, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి. గోపి ప్రారంభించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ లో 2వ అంతస్తులోగల జిల్లా శిక్షణ కేంద్రం (ఎమ్ సి హెచ్)లో ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటి (యం.సి.యం.సి) ని, మీడియా సెంటర్ ను సీపీ, అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన క్రమంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో బాగంగా గురువారం యం.సి.యం.సి. ని ప్రారంభించడం జరిగిందని పేర్కోన్నారు. ఈ కమిటీ సభ్యులు నిరంతరం వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాద్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను రూపొందించి ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. ప్రకటనలకు సంబంధించి యం.సి.యం.సి అనుమతి పొందే విధంగా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీ ఎల్.సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డీఆర్ఓ (ఇంచార్జీ) పవన్ కుమార్, సమాచార శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ కలీం, ఉపకార్యనిర్వహక సమాచార ఇంజనీర్ సి.హెచ్.కొండయ్య, ఏఓ సుధాకర్, డీఐఓ శివరాములు, డీవైఓ వెంకట రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement