సిరిసిల్ల, ఫిబ్రవరి 8 (ప్రభన్యూస్) : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటు అన్నిరకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా గురువారం జిల్లాలోని సర్దాపూర్ బెటాలియన్ లో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ జరిపించారు. శిక్షణలో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న, అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువలను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించాలన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినదించారు. ఈశిక్షణలో డీఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, రవికుమార్, సిఐ లు రఘుపతి, సదన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కిరణ్ కుమార్, ఆర్ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్ ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.