పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా సిబ్బంది పని చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, ఐక్యతగా ఉండడం, ఫిజికల్ ఫిట్‌నెస్, సిబ్బందికి విధులు, సేవలు ఇతర సమస్యలు ఉన్నాపై అధికారులకు చెప్పుకునే వీలుంటుందన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిబద్దతతో పని చేస్తున్నారన్నారు. ప్రజలు, అధికారుల మన్నన పొందేలా విధులు నిర్వర్తించాలన్నారు. వ్యక్తిగత సమస్యలు, విధుల్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సిపిఒ సంబందిత సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. అలాగే వ్యాయామం ఎంతో ముఖ్యమని, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మంచి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటే ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా అవకాశం ఉంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement