పెద్దపల్లి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్దపల్లి పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లతో పాటు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. అరెస్టులకు బీఆర్ఎస్ భయపడదని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ రాజ్యం నడుపుతున్నారన్నారు. ప్రజా పాలన పేరిట నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, కౌన్సిలర్లు, నాయకులు బిక్షపతి, పెంచాల శ్రీధర్, చంద్రశేఖర్, పెద్ది వెంకటేష్, సునీల్, సరేష్, సునీల్, హనుమంతు, ముబిన్, శ్రీనివాస్ తో పాటు పలువురున్నారు.
- Advertisement -