Tuesday, November 26, 2024

మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం : పెద్దపల్లి ఎస్ఐ రాజేష్

పెద్దపల్లి, ప్ర‌భ‌న్యూస్ : మహిళల భద్రతే పోలీసుల లక్ష్యమని పెద్దపల్లి ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. శనివారం రాత్రి పెద్దపల్లి మండలం లోని గౌరెడ్డి పేట రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి ఇన్చార్జి డి సి పి అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు మీకోసం కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడకూడదన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుందన్నారు.

వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మీ గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలిసినటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దన్నారు. విలేజ్ పోలీస్ అధికారి శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement