Friday, November 22, 2024

ప్లాస్మా పేరుతో టోక‌రా – అరెస్ట్..

క‌రీంన‌గ‌ర్ – కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఆసుపత్రుల్లో చేరి చికిత్స సమయంలొ ఊపయోగించే ప్లాస్మా కోసం ఇబ్బందులు పడుతుంటే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన భూక్యా బాలచందర్ మాత్రం ఇదే అదునుగా భావించీ సోషల్ మీడియాలో ఎవరైనా ప్లాస్మా ఇచ్చేవారు కావాలని అభ్యర్ధించినట్లైతే వెంటనె భూక్యా బాలాచందర్ వారినీ ఫోన్లో సంప్రదించి వారికి తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపేవాడు.. అయితే తాను రావడం కోసం మీరు ప్రయాణపు చార్జీలు పంపిస్తే రావడానికి సిద్ధం అని వారిని నమ్మబలికించి డబ్బులను తీసుకుని ఫొన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు . అత‌డి వ‌ల్ల తాము నమ్మి మోసపోయామని గ్రహించిన బాధితులు కరీంనగర్ పోలిస్ కమిషనర్ విబి కమలసన్ రెడ్డి ని సంప్రదించడంతో ,కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలొకి దిగిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ , మూడవ పట్టణ పొలీసులు నిందితుడిని మూడవ పట్టణ పోలిస్ స్టేషను పరిధిలో ప్రాంతంలో పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుడిని విచారణ నిమిత్తం కరీంనగర్ మూడవ పోలిస్ స్టేషను కు తరలించారు..

బాదితులను మోసగిస్తే చర్యలు తప్పవు:::: కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలసన్ రెడ్డి

కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి..ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి.కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీబాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి.అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు, అప్పటికే వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని,ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కరోన బాధితులకు ప్లాస్మాను ధానం చెయడం గొప్పవరంగా భావించాలి, అంతె కానీ ప్లాస్మా పెరుతో ఆసుపత్రిలో చేరిన వారివద్ద నుండి డబ్బులు డిమండ్ చేయడం మానవత్వము అనిపించుకోదు.ఒకవేళ ఎవరైనా ఇల్లాంటి మోసాలకు పాల్పడితే వారిపైన కేసు నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్లు తెరుస్తామని కరీంనగర్ పోలిస్ కమిషనర్ వి.బి.కమలసన్ రెడ్డి హెచ్చరించారు.
నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement