కరీంనగర్: కరీంనగర్ సిటీలో ఇక మీదట వరద ముంపు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, 134 కోట్లతో స్టాం వాటర్ డ్రెయినేజీల నిర్మణం చేపట్టామన్నారు మేయర్ సునిల్ రావు . కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం నగరంలోని 50, 59, 60 డివిజన్లలో పర్యటించారు. మొదటగా 50వ డివిజన్ పరిదిలోని గణేష్ నగర్ ప్రాంతంలోని బైపాస్ రోడ్డు స్టాంవాటర్ డ్రెయినేజీ పనులను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక కార్పోరేటర్లు అంజయ్య, కాసర్ల ఆనంద్ తో కలిసి తనిఖీ చేశారు. అంభేడ్కర్ స్టేడియం నుండి… కోతి రాంపూర్ ప్రధాన రహదారి వరకు పాదయాత్ర చేపట్టి… స్టాంవాటర్ డ్రెయినేజీ పనులను క్షున్నంగా పరిశీలించారు. అనంతరం 59, 60 డివిజన్ల పరిదిలో గల సంతోషిమాత టెంపుల్ ఏరియాలో నిర్మాణం చేస్తున్న స్టాంవాటర్ డ్రైనేజీ పనులను కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పోరేటర్లు గందె మాదవి మహేష్, వాల రమణ రావు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేసి… పరిస్థితిని పరిశీలించారు.
డ్రైనేజీ నిర్మాణం పనుల విషయంలో కాంట్రాక్టర్ తో పాటు ఇంజనీరింగ్ అధికారులను సలహాలు, సూచనలు చేసి.. ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న పంచముఖ హానుమాన్ దేవాలయంలో మేయర్ సునిల్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక సమస్యలు పలు అభివృద్ది విషయాల పై డివిజన్ ప్రజలతో చర్చించి.. వాటి పరిష్కారం పై ప్రజలకు హామీ ఇచ్చారు. ‘‘కొన్ని సంవత్సరాలుగా వర్షాలతో వరద ముంపునకు గురౌతున్న కాలనీలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లబింస్తుంది. గత అనుభవాలను దృష్ఠిలో పెట్టుకొని నగరపాలక సంస్థ ద్వారా 134 కోట్ల రూ. నిధులు కేటాయించి నగర వ్యాప్తంగా ముంపునకు గురౌతున్న అన్ని కాలనీలలో స్టాం వాటర్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడుతున్నాం. వేసవి కాలంలోగా పనులను పూర్తి చేయాలనే టార్గెట్ ప్రకారం టెండర్లు పిలిచి… ఇప్పటికే పనులను ప్రారంభించాం ఇందులో భాగంగానే నగరంలోని గణేష్ నగర్, జ్యోతినగర్ ప్రాంతాల్లో పర్యటించి డ్రైనేజీ పనులు కొనసాగుతున్న తీరును తనిఖీ చేసి పరిశీలించాం’’ అన్నారు.