పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ఉండాలని పెద్దపల్లి ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడుతూ కచ్చితంగా ఫైవ్ ఎస్ అమలు చేయాలని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెద్దపల్లి ఏసీపి సారంగపాణి పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ లు రాజేష్, సహదేవ్ సింగ్, రవీందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement