రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ రెమారాజేశ్వరి ఆదేశించారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి ఒక్క పోలీస్ అధికారి నాయకత్వం లక్షణాలు అలవర్చుకొని సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి పోలీస్ స్టేషన్ పరిధిపై పూర్తి అవగాహన ఉండాలని, తమ ప్రాంతంలో జరిగే చిన్న విషయం కూడా దృష్టికి రావాలన్నారు.
సమాచారం వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు సమాచారం ఉంటే నేర నియంత్రణ సాధన సాధ్యమవుతుందన్నారు. నేరనియంత్రంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. పొలిటికల్ మేనేజ్మెంట్, మీడియా, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అలవర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు మహేష్ గిరి ప్రసాద్, మోహన్, బాలరాజుతో పాటు పెద్దపెల్లి జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.