Friday, November 22, 2024

పెండింగ్ చలాన్లు కట్టాల్సిందే : పెద్దపల్లి ఏసిపి సారంగపాణి

వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించాలని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు కట్టించారు. అనంతరం మాట్లాడుతూ తనిఖీల్లో ఒక కారుపై 20 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాహనదారునిచే కట్టించామన్నారు. రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. వాహనదారులు ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. తనిఖీల్లో సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ మౌనిక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement