Sunday, November 17, 2024

పెండింగ్ కేసులను తగ్గించాలి.. సీీపీ సుబ్బారాయుడు

పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ హెచ్ఓ లు పెండింగ్ కేసులు తగ్గించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. పెండింగ్ కేసులు పరిమిత సంఖ్యకు లోబడి ఉండాలని చెప్పారు. శనివారం కరీంనగర్ కమీషనరేట్ లోని ఎస్ హెచ్ఓ లు, కోర్టుడ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ… నేరాలను ఛేదించడాన్ని సవాల్ గా తీసుకోవడంతోపాటు నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రతినేర సంఘటనలో నిందితులకు శిక్షింపబడేలా అన్నిస్థాయిలకు చెందిన అధికారులు పరస్పర సహకారంతో కృషిచేయాలని చెప్పారు. ప్రతి కేసులోని దశలను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా నిందితులు శిక్షింపబడుతారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఏనేర సంఘటనైనా ఒక ఛాలెంజ్ గా తీసుకుని ప్రణాళికబద్దంగా ముందుకు సాగితే సఫలీకృతం అవుతామనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. నిందితులు శిక్షింపబడటం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందడంతోపాటు అన్నివర్గాల ప్రజల్లో పాలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. నిందితులు శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలోకి రావడంతోపాటు పాతనేరస్థులు జైలుశిక్షలు విధించబడుతాయనే భయంతో నేరాలకు పాల్పడకపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

చిన్నచిన్న నేర సంఘటనలను నియంత్రించేందుకు ఈ-పెట్టి కేసులను నమోదు చేయాలని తెలిపారు. ఆకస్మిక వాహనాల తనిఖీలతో పాటు డ్రంకెన్ డ్రైవ్ లను నిర్వహించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను తగ్గించాలని చెప్పారు. పెండింగ్ వారెంట్ లను అమలు చేయడం ఛాలెంజ్ గా తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ వారెంట్ల అమలు ద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని సూచించారు. సమర్థవంతమైన సేవలందించే అన్నిస్తాయిలకు చెందిన పోలీసులకు ప్రోత్స్సహకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. సిసి కెమెరాల ఏర్పాటులో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములన చేయాలని తెలిపారు. సాంకేతిక కారణాలతో పనిచేయని సిసి కెమెరాలకు మరమ్మతులు చేయించాలని చెప్పారు.. పోలీస్ స్టేషన్ ఆవరణలో పనిచేయని సిసి కెమెరాలను కమీషనరేట్ కేంద్రంలోని నిపుణులను సంప్రదించి బాగుచేయించాలని సూచించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసిపి పి కాశయ్య, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లులతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement