Friday, November 22, 2024

Crime: స్నేహితులకే బురిడీ.. కోటిన్నరకు టోకరా.. అంతరాష్ట్ర చీటర్ అరెస్ట్

నమ్మిన స్నేహితులను అడ్డంగా మోసగించి కోట్ల రూపాయలు దండుకున్న అంతరాష్ట్ర చీటర్ ను పెద్దపల్లి పోలీజులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను పెద్దపల్లి ఏసిపి సారంగపాణి వెల్లడించారు. ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ సుల్తానాబాద్ కు చెందిన జక్కుల మమతను మోసగించి రూ. 15.50 లక్షల రూపాయల నగదుతో పాటు అయిదున్నర తులాల బంగారాన్ని తీసుకున్నాడని మమత ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మమత వివాహ సంబంధం కోసం తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టుకుందని, ప్రొఫైల్ చూసిన రాహుల్ మమతను వివాహం చేసుకుంటానని నమ్మించి చాటింగ్ మొదలు పెట్టాడన్నారు. తరచూ మమత దగ్గర నగదు తీసుకున్న తిరిగి ఇచ్చేవాడిని కొంతకాలం అనంతరం దగ్గర్నుండి వివిధ కారణాలు చెప్పి విదేశాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పి 6 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడన్నారు.

అనంతరం మమత కూడా అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏడున్నర లక్షల రూపాయల నగదు తీసుకున్నాడన్నారు. ఇటీవల మరి కొంత నగదు కావాలని చెప్పడంతో మమత నమ్మి అయిదున్నర తులాల బంగారాన్ని ఇవ్వగా మణిపురం ఫైనాన్స్లో బంగారం కుదవ పెట్టి 1.30 లక్షల నగదు తీసుకున్నాడన్నారు. రాహుల్ మోసగించాడని తెలుసుకున్న మతాలు సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా రాహుల్ మోసాలు బయట పడ్డాయన్నారు. 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాదులోని ఎల్బి నగర్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవలి కాలంలో స్నేహితుల పేరిట రుణాలు తీసుకొని నాలుగైదు నెలలపాటు ఈఎం ఐ లు కట్టి అనంతరం కిస్సులు కట్టకపోవడంతో స్నేహితులు కోట్లాది రూపాయలు కట్టాల్సి వచ్చిందన్నారు. మంగళగిరి కి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు ను 50 లక్షల రూపాయలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి 1.80 లక్షలు, షేక్ కలీల్ ను 4.86 లక్షలు, నాయుడు వెంకటేష్ ను 1.20 లక్షలు, హైదరాబాదుకు చెందిన ప్రసన్న లక్ష్మిని 25 లక్షలు, ప్రకాశం కు చెందిన కరీముల్లా ను 1.45 లక్షలు, బాచు అప్పన్నను 2.5 లక్షలు, ముప్పి రాజు మణికంఠ నుండి రెండు లక్షల రూపాయలు మోసగించడన్నారు. రాహుల్ ను లోకి తీసుకోవడంతో పాటు అతని వద్ద నుండి లక్ష రూపాయల నగదు, చెక్కులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కావద్దని జాగ్రత్తగా ఉండాలని కోరారు. నమ్మించి మోసగించిన రాహుల్ ను అదుపులోకి తీసుకొని అతడు చేసిన నేరాలను బహిర్గతం చేసిన సుల్తానాబాద్ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ ఉపేందర్ లతో పాటు సిబ్బందిని అభినందించడంతో పాటు నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement