Friday, November 22, 2024

ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకరించాలి మున్సిపల్‌ కమిషనర్‌

పట్టణ ప్రజలంతా ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకారం అందించాలని పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కమిషనర్‌ తిరుపతి మాట్లాడుతూ ప్రజలంతా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేయాలని కోరారు. ప్లాస్టిక్‌ బదులుగా పేపరు, బట్టలతో తయారు చేసిన వస్తువులను వాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటింటికి పర్యటించి ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement