Saturday, November 23, 2024

జలదిగ్బంధంలో పెద్దపల్లి

  • ఎడతెరిపి లేకుండా వర్షాలు
  • రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం

ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా జలదిగ్బంధమైంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెదబంకూరు వద్ద హుస్సేన్య వాగు పొంగి పొరడంతో రహదారి పూర్తిగా మునిగిపోయింది దీంతో రాకపోకలు స్తంభించి పోయాయి. రాజీవ్ రహదారిపై రంగంపల్లి వద్ద వరద నీరు ప్రవహిస్తుండడంతో నాలుగు రోజులుగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాహనాలను ఇరువైపులా పంపిస్తున్నారు. గడచిన 24 గంటల్లో పెద్దపల్లి జిల్లాలో 168.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ధర్మారం మండలంలో 245.5 మిల్లీమీటర్లు, పాలకుర్తి మండలం లో 186 మిల్లీమీటర్లు, అంతర్గాం మండలంలో 130 మిల్లీమీటర్లు, రామగుండం మండలంలో 137.7, రామగిరి మండలంలో 130, కమాన్పూర్ మండలంలో 134.5 ,పెద్దపల్లి మండలంలో 166.7, జూలపల్లి మండలంలో 24.3, ఎలిగేడు మండలంలో 224, సుల్తానాబాద్ మండలంలో 236.8, ఓదెల 151.4, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 173.1,
ముత్తారం మండలంలో 152.4, మంథని మండలంలో 86.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement