పెద్దపల్లి – కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేసినట్లు పెద్దపల్లిడిసిపి రవీందర్ పేర్కొన్నారు. శనివారం కూరగాయల మార్కెట్ లో ఉదయం 10 గంటలకు దుకాణాలను మూసి వేయించారు. వ్యాపారులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో పది గంటల తర్వాత అమ్మకాలు సాగించ వద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పాలవుతారని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపు అవకాశం ఇచ్చిందని ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలన్నారు. 10 గంటల తర్వాత బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ సి పి సారంగపాణి మాట్లాడుతూ దుకాణదారులు 10 గంటల తర్వాత దుకాణాలు మూసి వేయకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉందని, ప్రజలు కొనుగోలు సమయంలో కచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement