దొంగ సొత్తు ఎవరైనా కొంటే కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని స్క్రాబ్ కొనుగోలుదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్క్రాబ్ దుకాణాదారులు పరిశ్రమలలోని పాత వస్తువులను, రైతుల మోటార్లను, పాత వాహనాలను, ట్రాన్స్ఫార్మర్ లలోని కాపర్ వైర్లను కొనుగోలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేస్తామన్నారు. స్క్రాప్ దుకాణాదారులు ఖచ్చితంగా కొనుగోళ్ల విషయం రిజిస్టర్ లో పొందు పరచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement