Tuesday, November 19, 2024

ఆక్రమణకు తొలగించాల్సిందే: పెద్దపల్లి ఏసీపీ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద ఆక్రమణలను తొలగించాల్సిందేనని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి స్పష్టం చేశారు. బుధవారం జెండా కూడలిలో పెద్దపల్లి పోలీస్‌, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసిన షెడ్లను, సామాగ్రిని తొలగించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారిందని, ప్రతినిత్యం పట్టణ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చి వెళ్తుండడం వల్ల రద్దీ పెరిగిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యాపారస్తులు ఆక్రమణలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. తరచూ పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారని, వ్యాపార సముదాయాల ముందు నిబంధనలకు విరుద్దంగా సామాగ్రిని ఉంచితే సీజ్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ప్రదీప్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ఎస్‌ఐలు రాజేశ్‌, రాజవర్దన్‌, మౌనిక, శివాని,  సహదేవ్‌సింగ్‌తో పాటు పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement