- పురాతన శివాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలి
- 80 లక్షల విరాళం అందించిన దాతలు
సుల్తానాబాద్, ప్రభ న్యూస్ : దేవాలయాలలో ఆధ్యాత్మిక సేవలో తరించడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుడి మిట్టపల్లి శివాలయం అభివృద్ధికి పునర్నిర్మాణ కమిటీని ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు దాదాపు 80 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ దేవాలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 21 మంది కార్యవర్గంతో కమిటీని ఏర్పాటు చేసి ఊరికి ఈశాన్యంలో ఉన్న శివాలయాన్ని అభివృద్ధి పరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. నగునూరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి నేటి నుండే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. దాతలు భక్తి శ్రద్ధలతో తమ శక్తి మేర విరాళాలు ప్రకటించి శివాలయం పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు. త్వరలోనే జీర్ణస్థితిలో ఉన్న ఈ శివాలయాన్ని అత్యంత అద్భుత దేవాలయంగా నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ సహాయ సహకారాలతో నిర్మాణం చేపడితే ఊరు అభివృద్ధి చెందుతుందని, ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పాడి పంటలతో విరాజిల్లుతారన్నారు. నిర్మాణంలో దాతలు అందించిన ప్రతి రూపాయిని నిర్మాణానికి వినియోగిస్తామని, బ్యాంకు ఖాతాను తెరిచి డబ్బులను దేవుడి సేవకు వినియోగించి కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు అడిగిన వారికి ఖర్చును కాగితం రూపంలో అందించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తారన్నారు. అనంతరం పలువురు దాతలు విరాళాలు ప్రకటించడంతో వారిని గుడి మిట్టపల్లి ప్రాంతానికి చెందిన మహిళలు ఘనంగా సన్మానించారు. నగునూరి అశోక్ కుమార్ 5 లక్షల రూపాయలతోపాటు ధ్వజ స్థంభ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఎడవెల్లి రాంరెడ్డి రూ. 5లక్షల తోపాటు దేవాలయానికి ఎంత ఖర్చు తనవంతుకు అందించాలో అందిస్తానన్నారు. దేవాలయాన్ని నాలుగు నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు పూజ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని గుడిబిట్టపల్లి వాసులతొపాటు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, రైతు సమన్వయ సవిుతి జిల్లా అధ్యక్షులు కాసర్ల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీపీ డాక్టర్ ఐల రమేష్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జూపల్లి సందీప్ రావు, భారాస పార్టీ మండల అధ్యక్షులు పురం ప్రేమ్‌చందర్‌రావు, పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి రైస్ విుల్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవరావు, పల్లా మురళీధర్, రమేష్ మాటూరి ప్రసాద్, చకిలం మారుతి, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొల్లూరి జనార్ధన్, కొమురవెల్లి వీరభద్రయ్య, పల్లా సంతోష్ కుమార్, ఆకుల రాములు, దుగ్యాల సంతోష్‌రావు, సిరిపురం రమేష్, వెంగళ లింగమూర్తి, పల్లా సురేష్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కనవేని సతీష్, వేణుగోపాలస్వామి ఆలయ డైరెక్టర్ ఆరపల్లి సర్వేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.