గంజాయి సాగుచేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లులో గంజాయి మొక్క పెంచుతున్నారని సమాచారం మేరకు రైస్ మిల్ లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి మొక్కను పరిశీలించిన అనంతరం మిల్లు యజమానులను విచారించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ… పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సాగు చేసినా సరఫరా చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సరఫరా విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి సరఫరా దారులపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పూర్తిస్థాయి నిర్మూలనకు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఏసీపీ వెంట సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..