కాల్వశ్రీరాంపూర్: కరోనా మహమ్మారి ఒకపక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ విపత్కర పరిస్థితి సృష్టిస్తున్నప్పటికీ ఇంత సంక్షోభంలోనూ రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వెన్నంపల్లి, పెగడపల్లి, శ్రీరాంపూర్ గ్రామాల్లో ఐకెపి, శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు- చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మాస్కులు, శాని-టైజర్, అందుబాటు-లో ఉంచాలని, నీటి వసతి కల్పించాలన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్‌పిటిసి వంగల తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అని, సింగిల్విండో చైర్మన్‌లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, సర్పంచులు ఆడెపు శ్రీదేవి రాజు, బుర్ర మంగ సదానందం, ఆరెల్లి సుజాత రమేష్, కాసం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీ-సీలు జెట్టి దేవన్న, సుముఖం నిర్మల మల్లారెడ్డి, మాదాసి సువర్ణ చందు, ఏఓ నాగార్జున, ఏపీఎం సంఘ సదానందం, నాయకులు కొట్టే రవీందర్, జిన్నా రామచంద్రారెడ్డి, నిదానపురం దేవయ్య, ఈర్ల శ్రీనివాస్, ఎండి ఇబ్రహీం, కుమార్, నవీన్, కిరణ్, సిఈఓలు కొల్లేటి శ్రీనివాస్, బోడకుంట విజేందర్, సర్పంచులు, ఎంపీటీ-సీలు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement