వేములవాడ: ఛలో చందుర్తి మోత్కూర్‌రావుపేట జంగల్ అనుమతుల కోసం చేసే పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మండి పడ్డారు. చందుర్తి నుండి మోత్కూర్‌రావుపేట అటవీ అనుమతుల కోసం చేపట్టే పాదయాత్రకు బయలుదేరుతున్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్‌ని పోలీసులు ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. రోడ్డు కోసం మేం దీక్షలు చేశామని అధికార పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, మీరు చేస్తే ఒప్పు మేం చేస్తే తప్పు అవుతుందాని అని ప్రశ్నించారు. ప్రశ్నించే నాయకులు 7 ఏళ్లుగా అధికారంలో ఉన్నా పనుల్లో జాప్యానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే చందుర్తి జడ్పిటిసిని కూడా వేములవాడలో పోలీసులు అరెస్టు చేశారు. చందుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామిని నర్సింగాపూర్‌లో అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement