గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి పథకం ద్వారా వసతులు కల్పిస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఓదెల మండలంలోని గుండ్లపల్లి లో రూ.4,16,000 ల నిధులతో చేపట్టనున్న పాఠశాల పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు – మన బడి పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కావేటి రాజు, వైస్ ఛైర్మెన్ మద్దెల కమల-నర్సయ్య, జిల్లా డైరెక్టర్ కందుల సదాశివ, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆకుల మహేందర్, సతీష్, యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ పులుగు తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ ఆరెల్లి సరోజన-మొండయ్య, ఉప సర్పంచ్ వేల్పుల శ్రీనివాస్, డైరెక్టర్ లు కొట్టే దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొట్టే మహేందర్, గ్రామ పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు నారాయణ రెడ్డి, వేల్పుల సదయ్య, కేశవ రెడ్డి, బుచ్చి రాజిరెడ్డి, హన్మంత రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement