ఓదెల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కు లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని మండల తహసీల్దార్ రామ్మోహన్ తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పని చేసే చోట, ప్రయాణ సమయంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అలాగే ప్రజలు తరచూ చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని, రద్దీ ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. 45 ఏళ్లు నిండిన వారంతా ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరిగా వ్యాక్సీన్ వేయించుకోవాలని, కరోనా నుంచి రక్షణగా వ్యాక్సీన్ దోహదపడుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement