Sunday, November 24, 2024

Peddapalli: ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి.. ర్యాగింగ్ చేస్తే జైలుకే.. సిఐ అనిల్

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని, ర్యాగింగ్ చేస్తే జైలుకేనని పెద్దపెల్లి సిఐ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో కమ్యూనిటీ పోలీసింగ్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానానికి ఎదుగుతారన్నారు. చదువుకునే వయసులో చెడు అలవాట్లకు లోనైతే బంగారు జీవితం బుగ్గిపాలవుతుందన్నారు.

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే జైలుశిక్ష తప్పదన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పమన్నారు. సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గంజాయి సరఫరా చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు జారీ చేసిందని, పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ మహేందర్ తో పాటు ట్రినిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement