కాల్వశ్రీరాంపూర్: మండలంలోని మల్యాల గ్రామంలో సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్య ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ ద్వారా అధిక దిగుబడి వచ్చి రైతుకు లాభాల వస్తాయని హార్టికల్చర్ ప్రోగ్రాం అధికారులు కాంపెళ్లి క్రాంతి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్లి అక్కడి రైతులు, ఆయిల్ మిల్లర్ల ద్వారా వివరిస్తామన్నారు. ఈ ప్రాంతంలోనూ ఆయిల్ పామ్ ఎక్కువగా సాగుచేసేలా చూస్తామని, ప్రభుత్వం నుండి హెక్టార్‌కు రూ. 1.20లక్షలు ఖర్చులకు ఇచ్చి ఇందులో 50శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు కాసర్ల మల్లారెడ్డి, పంచాయితీ కార్యదర్శి నాగరాజు, ఉపసర్పంచ్ సంది విజయ సంజీవరెడ్డి, వార్డుసభ్యులు రేండ్ల నగేష్, లొనే రమాదేవి, మాజీ సర్పంచ్‌లు జక్కే రవీందర్, పడాల కుమారస్వామి, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement