Thursday, November 21, 2024

మా కుటుంబానికి న్యాయం చేయండి..

ఎల్లారెడ్డిపేట: చేయని తప్పుకు గత నాలుగేళ్లుగా బహిష్కరణతో తీవ్ర మనోవేదనకు గురైన మా కుటుంబానికి తగు న్యాయం చేయాలని బాధితుడు చింతకింది శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అన్న చింతకింది బాలరాజ్‌ గౌడ్‌కు తనకు ఉమ్మడి స్థిరాస్తి వివాదం గత నాలుగేళ్లుగా నడుస్తోందన్నారు. కుల సంఘం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా సంఘం పెద్దలు ఏకపక్షంగా వ్యవహరించి తన కుటుంబానికి అన్యాయం చేశారన్నారు. ప్రతి కార్యక్రమానికి తమ కుటుంబాన్ని దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేటలో ఐదేళ్లకోసారి నిర్వహించే రేణుక ఎల్లమ్మ సిద్ధోహం వేడుకలకు తన కుటుంబానికి న్యాయం కోసం అడగడానికి వెళ్లగా కుల సంఘం పెద్దల సమక్షంలో చింతకింది కిషన్‌ గౌడ్‌ అకారణంగా జోక్యం చేసుకొని తనపై భౌతిక దాడికి ప్రయత్నించాడని ఆరోపించారు. తనను తన భార్యను నానా బూతులు తిడుతూ చంపేస్తానని సంఘం సభ్యుల సమక్షంలోనే తనను తన కుటుంబాన్ని అవమాన పరచాడని వాపోయారు. కిషన్‌గౌడ్‌తో తనకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్సై వెంకటకృష్ణకు ఫిర్యాదు చేసి తనకు తన కుటుంబానికి తగు న్యాయం చేయాలని బాధితులు చింతకింది శ్రీనివాస్‌ విలేకరులతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement