హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పేరుతో ఒక బృహత్తర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన శరవేగంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకం కింద 12 రకాల మౌలిక వసతులను కల్పించింది. దాంతో ఆరు దశాబ్దాల ప్రభుత్వ బడికి అపురూప శోభ వచ్చింది. ఇదే విషయాన్ని ‘మన ఊరు-మన బడి’ ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టును మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement