Tuesday, November 26, 2024

New Delhi: ‘సాహిత్యోత్సవం 2024’ కు కవి అన్నవరం దేవేందర్ కు ఆహ్వానం.

కేంద్ర సాహిత్య అకాడమీ ఈనెల 11నుంచి 16 వరకు నిర్వహించే ప్రపంచంలో అతిపెద్ద సాహిత్యోత్సవం ‘ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024’లో పాల్గొనేందుకు కరీంనగర్ కు చెందిన కవి అన్నవరం దేవేందర్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ కార్యదర్శి కే శ్రీనివాసరావు లేఖ రాస్తూ ఈ భారీ ఉత్సవంలో పాల్గొని ’21వ శతాబ్దపు భారతీయ కవిత్వం: కవి సమ్మేళనం’లో పాల్గొని కవిత చదవాల్సిందిగా కోరారు.

సాహిత్య అకాడమీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆరు రోజులుగా సాగే సాహిత్య ఉత్సవంలో 175 భాషల నుంచి జాతీయస్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి రచయితలు, కవులు, పరిశోధకులు స్కాలర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలోనే కథ కవిత్వం నాటక రంగంపై అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సాహిత్య అకాడమీ పురస్కారాలు, ప్రఖ్యాత ఉర్దూ సినీ కవి గుల్జార్ వార్షిక ఉపన్యాసం ఉంటుందని ఆ ఆహ్వానంలో పేర్కొన్నారు. అన్నవరంకు ఈ అవకాశం రావడం పట్ల కరీంనగర్ సాహితీ లోకం హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement