22 జూలై 1947 రోజున భారత రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో మన నేటి జాతీయ పతాకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శుభ గడియలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏట 22 జూలై రోజున జాతీయ పతాక ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడి కనీస బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ జి వి శ్యాంప్రసాద్ లాల్ భావోద్వేగంతో అన్నారు. ఈ రోజు కరీంనగరంలోని లయన్స్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భరత జాతికి హృదయ స్పందన మన జాతీయ జెండా అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ లయన్ రిక్కల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మన త్రివర్ణ పతాకంలోని కాషాయం ధైర్య త్యాగాలను, తెలుపు శాంతి సత్యాలను, ఆకుపచ్చ వర్ణం సంపద, నమ్మకాలను సూచిస్తో మనల్ని నడిపిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఏట ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ నగరవాసుల్లో దేశభక్తిని జాగృతం చేయడం ముదావహం అన్నారు.
కరీంనగర్ బస్ స్టాండ్ వద్ద జెండా పండుగ ర్యాలీని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా గవర్నర్ నారాయణ రెడ్డి ప్రారంభించగా యన్‌సిసి కెడెట్లు, లయన్స్ దేశ భక్తికి సంబంధించిన నినాదాలు చేస్తూ టవర్ సర్కిల్ వరకు కొనసాగింది. టవర్ సర్కిల్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి నిత్య జనగణమన గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉప గవర్నర్లు హనుమాండ్ల రాజిరెడ్డి, నడిపల్లి వెంకటేశ్వర రావు, పిడిజీలు చిదుర సురేశ్, కొండా వేణుమూర్తి, సమన్వయ కర్తలు కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి,లింగరాజు కోదండరాములు, సింగిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఆర్‌సిలు సాయినేని నరేందర్, ఇనుగుర్తి రమేష్, జడ్‌సిలు వడుకాపురం జగదీశ్వరాచారి, అబ్దుల్ మతీన్, నగర క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు, నగర పౌరులు రమేష్, వ్యాపార సంఘ బాధ్యులు, సీనియర్ లయన్స్, యన్‌సిసి సిబ్బంది, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.