Thursday, September 12, 2024

Peddapalli: ఘనంగా నాగుల పంచమి వేడుకలు..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నాగుల పంచమి పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పుట్టలను దర్శించుకున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిన నాగ పంచమిని పురస్కరించుకొని మహిళలు ఉదయమే నూతన వస్త్రాలు ధరించి వివిధ దేవాలయాలు గ్రామాల్లో ఉన్న పుట్ట ల వద్దకు చేరుకొని నాగ దేవతలకు ఆవుపాలు పోసి, పళ్ళు, ఫలహారాలు, పువ్వులు, సమర్పించారు.

మహిళలతో పాటు పురుషులు సైతం నాగదేవతల కు పాలు పోసి పూజలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో మహిళలు పూజలు నిర్వహించారు. సుఖ శాంతులు ప్రసాదించాలని నాగదేవతలను వేడుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement