ముత్తారం: కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని కేడీసీసీ బీ డైరెక్టర్, ముత్తారం సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఓడేడ్, అడవిశ్రీరాంపూర్, ముత్తారం, పారుపల్లి గ్రామాలలో ఏర్పాటు- చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిపి జక్కుల ముత్తయ్య, జెడ్పీటీ-సీ చెల్కల స్వర్ణలత అశోక్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోస పోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర గ్రేడ్ ఏకు రూ. 1888, కామన్‌కు రూ. 1868 పొందాలన్నారు. రైతుల సంక్షేమం కోసం తెరా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ పోతిపెద్ధి రమణరెడ్డి, తెరాస మండల్ అధ్యక్షుడు పోతి పెద్ధి కిషన్‌రెడ్డి, వైస్ ఎంపిపి సుధాడి రవీందర్రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు అత్తె చంద్రమౌళి, సర్పంచులు సిరికొండ బక్కరావు, తుంగాని సమ్మయ్య, తుటి రజిత రఫీ, పర్ష లక్ష్మి రత్నం, పాలక వర్గ సభ్యులు గుజ్జ గోపాల్‌రావు, ఆల్గం నిర్మల పాపయ్య, మద్దెల వెంకట లక్ష్మి రాజయ్య, అల్లాడి యాదగిరిరావు, నాయిని పార్వతి, కోంకటి మల్లయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ నాంసాని సమ్మయ్య, మార్కెట్ కమిటీ- డైరెక్టర్ కురకుల ఓదెలు, సహకార సంఘం మాజీ డైరెక్టర్ బొల్నేని బుచ్చారావు, అడవిశ్రిరంపూర్ ఎంపీటీ-సీ దొడ్డ గీతారాణి బాలాజీ, మాజీ సర్పంచ్‌లు, ఏఓ చిందం శ్రీకాంత్, సీఈఓ దాసరి ప్రసాద్, ఏఈఓలు సాయివర్మ, మౌనిక, మండల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement