కార్పొరేట్ సంస్థలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టడమే ధ్యేయంగా మోడీ పనిచేస్తున్నారన్నారు. గులాబీ జెండా నీడలో అభివృద్ధి సాధ్యమని, రాజకీయ ప్రత్యర్థులపై యుద్ధం కొనసాగించాలన్నారు. అసత్య ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని, కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక తీరును ప్రజలు ఎండగట్టాలన్నారు.
మోడీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కొమ్ము కాస్తుందని, ఎల్ఐసి వంటి సంస్థలను అమ్మాలని చూస్తుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని కేవలం రాజకీయ వేదిక కోసం బీజేపీ దాన్ని వాడుకుందన్నారు. బీజేపీ యువతను పక్కదారి పట్టించే రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రతి గ్రామంలో యువత నిలదీయాలన్నారు.