నియోజకవర్గంలోని 102 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణం..
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు మహిళలకు నూతన సంవత్సర కానుకను నియోజకవర్గం లోని మహిళలకు అందజేశారు. నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి గ్రామంలో 18 లక్షలు వెచ్చించి 102 “సమ్మక్క – సారలమ్మ” మహిళా భవన్ లను నిర్మించాలని గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు. ఇందులో తొలివిడతలో భాగంగా ఐదు మండలాల పరిధిలోని 58 గ్రామాలను ఎంపిక చేయడం జరిగినది. విడతలవారీగా అన్ని గ్రామ పంచాయతీలలో మహిళా భవన్ లను నిర్మించనున్నారు. ఇప్పటికే చెన్నూరు మహిళా భవనానికి 1.50, రామకృష్ణాపూర్ మహిళా భవన్ కు 2 కోట్లు, మందమర్రి మహిళా భవన్ కు 2 కోట్ల రూపాయలు కేటాయించగా శరవేగంగా పనులు నడుస్తున్నాయి. నియోజకవర్గంలోని గ్రామాల్లోతొలివిడతలో మందమర్రి మండలంలో బొక్కలగుట్ట, అందుగులపేట్, చిర్రకుంట, ఆదిల్ పేట్, వెంకటాపూర్, మామిడిగట్టు, పొన్నారం, పులిమడుగు, సారంగపల్లి, భీమారం మండలంలో మద్దికల్, బూరుగుపల్లి, ఆరేపల్లి, కొత్తపల్లి, ధాంపూర్, ఖాజీపల్లి, చెన్నూరు మండలంలోని కొమ్మెర, దుగ్నేపల్లి, పొక్కురు, నాగపూర్, సుద్దాల, ఆస్నాద్, సోమనపల్లి, కిష్టంపేట, అంగ్రాజ్ పల్లి, గంగారం, సుందరశాల, కత్తెరశాల, కాచన్ పల్లి, నారాయణపూర్, ఎర్రగుంటపల్లి. కోటపల్లి మండలంలోని అన్నారం, పారుపల్లి, జనగామ, కొండంపేట్, కొల్లూర్, సిర్స, దేవులవాడ, లింగన్నపేట, మల్లంపేట, నక్కలపల్లి, రాంపూర్, రొయ్యలపల్లి, శెట్పల్లి, ఆల్గావ్, రాపన్ పల్లి, నాగంపేట్.జైపూర్ మండలంలోని మిట్టపల్లి, ఇందారం, రామారావు పేట, షెట్ పల్లి, టేకుమట్ల, కుందారం, కిష్టాపూర్, శివ్వారం, పౌనూర్, పెగడపల్లి, ముదిగుంట, కాన్కూర్ గ్రామాలు ఉన్నాయి.