Friday, November 22, 2024

పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత భరోసా: ఎమ్మెల్యే కోరుకంటి

తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పేదల  కోసం సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. శనివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 38,39, 47,49 డివిజన్లలో మంజూరైన  కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు సీఎం కెసిఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత భరోసా సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ లోని పేదోళ్లకు అభయహస్తం, కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ పథకమని పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో ఆత్మహత్యలు ఆకలిచావులు వుండేవని కానీ, నేడు రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement