Thursday, November 21, 2024

పేద ఆడబిడ్దలకు కానుక కళ్యాణ లక్ష్మి

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల కోసం ప్రజాహిత సంక్షేమ పధకాలను ప్రవేశ పెడుతున్న ఎకైక సిఎం కేసీఆర్‌ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. సంక్షేమ పధకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన మహనీయులు అని పేర్కొన్నారు. అదివారం పలు డివిజన్లలో మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా అందించారు. అలాగే, వారి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కానుకగా కళ్యాణలక్ష్మి పథకమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదోళ్లకు అభయహస్తం కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకమని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారంతో పాటు ప్రసవించిన తర్వాత మగబిడ్డ పుడితే 12వేలు,  ఆడబిడ్డ పుడితే 13 వేల రూపాయలు కెసిఆర్ కిట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు  అమలు కావడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కెసిఆర్ కి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement