Saturday, November 23, 2024

కంటి వెలుగును ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమం అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం సుల్తానాబాద్ మండల కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ స్థానిక గుడి మిట్టపల్లి కాలనీలో ప్రారంభించారు. ప్రజలకు కంటి పరీక్షలను వైద్యుల బృందం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గతంలో పాలనలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాల్ని చేపట్టలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఎల్ ఓ సి లను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ కుటుంబంలో పెద్దకొడుకులా వ్యవహరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలువురు కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి మందులు, అద్దాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, వార్డు కౌన్సిలర్లు పసిడ్ల మమత సంపత్ గుర్రాల శ్రీనివాస్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సాజిద్, వైద్యులు డాక్టర్ మధుకర్ రెడ్డి శ్రీజ పురుషోత్తం, హెచ్ ఇ ఓ శ్రీనివాస్ రెడ్డి ఏఎన్ఎంలు వీణ రమ శారద అంగన్వాడీలు భూలక్ష్మి స్వర్ణ ఆశా వర్కర్లు తోపాటు మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, వార్డు ఆఫీసర్ రమేష్, ఆర్ పి లు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement