ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావిగా అంబేద్కర్ నిలిచారన్నారు. తన మేధస్సుతో దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్లాంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ఆడెపు వెంకటేశం, తెరాస మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement