రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం కిరికిరి అయినా రైతాంగం నష్ట పోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయల ఖజానాపై భారం పడుతున్న గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి గారు,మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement